రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటా ఆళ్ల రామకృష్ణారెడ్డి

రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటా ఆళ్ల రామకృష్ణారెడ్డి

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటానని అన్నారు…. నిన్న వైసీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వాటిని ప్రజెంటేషన్ ద్వారా వివరించింది…

ఇక ఇదే క్రమంలో వైసీపీ నాయకులు కూడా అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించింది టీడీపీ… అందులో బాగంగానే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధానిలో 5 ఎకరాలు భూమిని కొన్నారని మాజీ ఎమ్మెల్యే ఉమా ఆరోపించారు….

దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు.. నీరుకొండ గ్రామంలో తనకు ఐదు ఎకరాల ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు… నిజంగా భూములు తనకంటూ ఉంటే అవి తిరిగి ఇచ్చేస్తానని అన్నారు…

తనపై టీడీపీ నేతలు ఎల్లో మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు… తనకు రాజధాని ప్రాంతంలో భూమలు ఉన్నట్లు అయితే శాశ్వితంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని అన్నారు…