అప్పుడే కొత్త మార్గాలలో రాజమౌళి అడుగులు..

అప్పుడే కొత్త మార్గాలలో రాజమౌళి అడుగులు..

0

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తీ కాలేదు. ఈ సినిమాను వచ్ఛే సంవత్స రంలో జులైలో విడుదల చేయాలనీ రాజమౌళి పట్టు మీద ఆపనిచేసున్నా పరిస్థితులు అతనికి సహకరించడం లేదన్న అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో హాలీవుడ్ నుంచి రాజమౌళికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ మధ్య అమెరికాకు వెళ్లిన రాజమౌళికి ఇండియాతో సంబంధం ఉన్న ఒక భారీ హాలీవుడ్ ప్రొడక్షన్ ఆఫర్ ఇచ్చిందని టాక్.

ఆర్ ఆర్ ఆర్ పూర్తీ అయినా తర్వాత రాజమౌళి మహాభారతం మొదలు పెడితే తమ వంతు సహకారం ఇస్తామంటూ ఒక హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ రాజమౌళికి ఇచ్చిన సూచనా మేరకు, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి ఆలోచనలు చేస్తున్నట్టు టాక్. వాస్తవానికి మహాభారతం ప్రాజెక్ట్ ఆలోచనలు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అమిర్ కు ఆసక్తి తగ్గిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆలోచనలలో మహాభారతం చేయాలనీ హలివుడ్ నిర్మాణ సంస్థ తన వంతు కృషి చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే రాజమౌళి ఎవరెవరు ఈ పాత్రలకు సరిపోతారని తన సన్నిహితులతో చర్చించగా భీష్ముడిగా అమితాబ్, దుర్యోధనుడిగా రానా, భీముడిగా మోహన్ లాల్ అర్జునుడిగా మహేష్ పాత్రలను రాజమౌళికి సూచించారట.. ఇక కృష్ణుడి విషయంలో ఎవరు సూచనా ఇవ్వలేదట. ఒక వేళా రాజమౌళి ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే నటీనటుల డేట్స్ దొరకడం అంత సులభతరం కాదంటూనే, ఈ ప్రాజెక్ట్ రాజమౌళి చేస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో రాజమౌళి శాశ్వతంగా మిగిలిపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు కొందరు సినీ నిర్వాహకులు.