‘మా’ ఎన్నికలపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్

Rajendra Prasad's shocking comment on 'our' election

0

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని చిన్న తిరుపతిగా పిలిచే ద్వారకా తిరుమల వెంకన్నను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ను ‘మా’ ఎన్నికలపై అభిప్రాయం చెప్పాలని అడగ్గా.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ సమాధానమిచ్చారు.

ఆ విషయం తప్ప మిగతా విషయాలు అడగాల్సిందిగా మీడియాకు చెప్పారు. ‘మా’ ఎన్నికలపై తప్ప మిగతా వాటిపై ఆయన సమాధానాలు చెప్పారు. ఈ నెల 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వర్గం సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. విష్ణు ప్యానెల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here