రజనీ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్

రజనీ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్

0

స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తే ఏ నటులు వదులుకోరు ..ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో సీనియర్ నటులతో సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.. ఇక చిరంజీవి, కమల్, రజనీకాంత్, సినిమాలో చిన్న పాత్ర వచ్చినా నటించేందుకు వారు ఉత్సాహం చూపిస్తారు. పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం సై అంటారు.

తాజాగా మహానటి తరువాత బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ ఊపందుకుంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సుమారు నాలుగు చేస్తోంది.. ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్. ఆమె తలైవా రజినీకాంత్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

తాజాగా ఈ విషయాన్ని తెలియచేసింది కీర్తి. మాస్ చిత్రాల దర్శకుడు శివ తో రజిని తన 168వ చిత్రం చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమాని పెద్ద నిర్మాణ సంస్ధ
సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది… ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారు చిత్ర యూనిట్, నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ఆయన పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం రావడం చాలా హ్యాపీ అంటూ తన ఆనందం చెప్పుకుంది కీర్తి.