రాక్షసుడు సెన్సార్ రిపోర్ట్

రాక్షసుడు' సెన్సార్ రిపోర్ట్

0

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్ ఖాతాలో ఇంకా హిట్ పడలేదు. అయినా ఆయన నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆయన తాజా చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. రాజీవ్ కనకాల,శరవణన్,రాధా రవి,వినోద్ సాగర్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. రాక్షసుడు రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్ర నిడివి 149 నిమిషాలు. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. టీనేజ్ గర్ల్స్ ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. ఇందులో శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. మొదట్లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లలో నటించిన బెల్లకొండ కొన్నాళ్లుగా వైవిధ్యమైన సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాక్షసుడు ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేస్తుందని చెబుతున్నారు.