చరణ్ నెక్ట్స్ ఆ డైరెక్టర్ ను ఒకే చేశాడా….

చరణ్ నెక్ట్స్ ఆ డైరెక్టర్ ను ఒకే చేశాడా....

0

ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో ఆచర్య మూవీ చేస్తుండగా ఆయన కుమారుడు రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు… ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు…

అయితే అన్ని కుదిరిఉంటే ఈ పాటికి ఈ రెండు చిత్రాలు విడుదల అయ్యేవి.. కానీ కరోనా కారణంగా అన్ని తారుమారు అయ్యాయి… ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ అవ్వడానికి ఇంకో ఎడాది పడుతుందని అంటున్నారు… ఈ క్రమంలోనే చెర్రీ గురించి ఒక వార్త హల్ చేస్తోంది.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ ఒక మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి…

2007లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిరుత మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు… ఈసినిమా పూర్తి అయిన తర్వాత బాలీవుడ్ ఒక మూవీ చేయాలని చూస్తున్న తరుణంలో ఈ వార్త తెరపైకి వచ్చింది. ఇటీవలే పూరి జగన్నాథ్ కు మెగా క్యాంపు నుంచి పిలుపు అందిందని వార్తలు వస్తున్నాయి… చరణ్ కూడా పూరితో సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నారని దీంతో మల్లీ చిరుత రిపీట్ చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here