రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం..ఈసారి..

Ram Gopal Varma is another sensation ..

0

వర్మ అంటేనే వివాదాలు. వివాదాలు లేకుండా వర్మ బతకలేడు. అలాగే నిత్యం వార్తల్లో నిలవడం రామ్‌గోపాల్‌ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక కాంట్రవర్సీతో ఆర్జీవీ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇక ఒకప్పుడు హర్రర్‌ మూవీస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న వర్మ ఆ తర్వాత మాత్రం క్రమంగా హర్రర్‌ మూవీస్‌ని తగ్గించి యాక్షన్‌, రొమాంటిక్‌ మూవీస్‌పై పడ్డారు.

అయితే తాజాగా ఆర్జీవీ మరో సంచలనానికి తెర తీశాడు. మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్దమయ్యాడు ఆర్జీవీ. ఈసారి తన సొంత కథతో కాకుండా రచయిత యండమూరి విరేంద్ర నాథ్‌ కథతో రానున్నారు. తన సొంత కథలతో యాక్షన్‌, రొమాంటిక్‌ సినిమాలు తీసే వర్మ రచయిత నవల ఆధారంగా తీసే ఈ మూవీని ఎలా డీల్ చేస్తాడో చూడాలి మరి.

ఇందులో భాగంగానే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్‌ రచయితగా వ్యవహరించిన ‘తులసీ దళం’ నవల కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తులసీ దళం కథకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు వర్మ..‘తులసి తీర్థం’ అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here