సీతను కలిసిన అల్లూరి..

సీతను కలిసిన అల్లూరి..

0

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్..రీసెంట్ గా వినయ విధేయ రామ ఫేమ్ కియారా అద్వానీ ని కలిశారు . తాజాగా ఈమె పుట్టిన రోజు వేడుకలు ముంబై లో అట్టహాసంగా జరుపుకుంది . ఈ వేడుకలకు చరణ్ హాజరైనట్లు తెలుస్తుంది. దీని తాలూకా ఫొటోస్ బయటకు వచ్చి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. కోరమీసంతో బ్లాక్ డ్రెస్‌లో చరణ్ దర్శనం ఇచ్చాడు. ఆయన లుక్ కిరాక్ పుట్టిస్తుంది. అభిమానులు చరణ్‌ని చూసి సంబరపడిపోతున్నారు.

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ” చిత్రంలో కియారా అద్వానీ నటించిన విషయం విదితమే. కొణిదెల రామ్, సీత అనే పాత్రలలో ఇద్దరు రొమాంటిక్ కపుల్ గా నటించి అలరించారు. ప్రస్తుతం చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఆయనకి జోడీగా అలియా భట్ నటించనుంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దానయ్య నిర్మిస్తున్నాడు.