వర్మ గిఫ్ట్ మాములుగా లేదు?

వర్మ గిఫ్ట్ మాములుగా లేదు?

0

వర్మ ఏం చేసిన, చేయకపోయినా సంచలనమే. లక్ష్మిస్ ఎన్టీఆర్ తో హిట్ అందుకున్న ఈయన.. రీసెంట్ గా ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను ప్రకటించి సంచలనం రేపాడు. ప్రస్తుతం ఈ సినిమాలోని కాస్ట్ క్రూ ను వెతికే పనిలో ఉన్న వర్మ.. ఈరోజు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భాంగా పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను పోలిన ఒక క్యారెక్టర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ’కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఎవరిదో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేసి పెద్ద రచ్చే చేసాడు. అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్‌ను పోలిన మనిషి ఫోటోను ట్వీట్ చేసి పెద్ద వివాదానికి తెర లేపాడు. ఈ ఫోటోను ముందుగా చూస్తే అందరు పవన్ కళ్యాణే అనుకుంటున్నారు. కాస్తంత దౄస్టి పెడితే కానీ.. పవన్ కళ్యాణ్ కాదనే విషయం అర్ధమవుతుంది.