బాబును భయపెడుతున్న రామ్ మాధవ్.. పవన్ తో సహా ?

బాబును భయపెడుతున్న రామ్ మాధవ్.. పవన్ తో సహా ?

0

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను తమవైపుకు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నది. ఇప్పటికే టిడిపి నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు.

అంతేకాదు, తెలుగుదేశం పార్టీ నుంచి మరికొంతమంది నేతలు బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిలకు సిద్ధం చేసుకుంటోంది పార్టీ.

తెలుగుదేశం పార్టీలోని కొంతమంది శ్రేణి నేతలు ఇప్పటికే పార్టీలోకి వచ్చారు. మరో మూడు నాలుగు రోజుల్లో మరికొందరు పార్టీలు చేరేందుకు సిద్ధం అవుతున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారంటూ వార్తలు వెలువడుతున్నాయి.

బీజేపీ కేంద్ర అధిష్టానం ఈ దిశగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రామ్ మాధవ్, మురళీధర రావులు చురుగ్గా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల నటిని తెలుగురాష్ట్రాల్లో బలపడితే.. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవు. మరి బీజేపీని అడ్డుకునే శక్తి టీడీపీ ఉందా చూడాలి. అటు జనసేన పార్టీ నుంచి కీలక నేత కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.