రానా నిర్మాతగా మురళీధరన్ బయోపిక్.. నటించనున్న సచిన్

రానా నిర్మాతగా మురళీధరన్ బయోపిక్.. నటించనున్న సచిన్

0

శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమాలో టీమిండియా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నటించనున్నాడు. ఈ విషయాన్ని డీఏఆర్ మోషన్ పిక్సర్స్ ప్రొడక్షన్ హెడ్ సేథుమాధవన్ వెల్లడించాడు. మురళీధరన్ భార్య కూడా ఈ సినిమాలో నటిస్తోందని, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేస్తామని తెలిపాడు.

మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తుండగా, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నాడు. తాత్కాలికంగా ఈ సినిమాకు ‘800’ అని పేరు పెట్టారు. కాగా, డీఏఆర్ ప్రొడక్షన్స్‌తో కలిపి ఓ లెజండరీ నటుడి ద్వారా లెజెండ్ సినిమాను తెరకెక్కిస్తున్నందుకు గర్వంగా ఉందని రానా దగ్గుబాటి ట్వీట్ చేశాడు.