రానా, తేజ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

రానా, తేజ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

0

రానా కథానాయకుడిగా గతంలో వచ్చిన ‘నేనేరాజు నేనేమంత్రి’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా రానా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. చాలా కాలం తరువాత తేజ ఖాతాలో ఒక విజయాన్ని జమ చేసింది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

‘సీత’ పరాజయం తర్వాత కొత్త సినిమా ఏదీ మొదలు పెట్టలేదు. అయితే తేజ తన తర్వాతి సినిమాని రానాతో చేయనున్నాడని ఫిలింనగర్ సమాచారం. తనకి కమ్ బ్యాక్ ఫిలిం ఇచ్చిన రానా అయితే సెంటిమెంట్‌గా వర్కౌట్ అవుతుందనుకున్నాడేమో కానీ తేజ రానా కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే ఈ సినిమా కోసం ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది.ఇప్పటికే రానా హీరోగా విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి ఓ నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం..