రంగంలోకి విజయసాయిరెడ్డి… పవన్, చంద్రబాబులకు ఒకే సారి

రంగంలోకి విజయసాయిరెడ్డి... పవన్, చంద్రబాబులకు ఒకే సారి

0

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే రిపోర్టులో కరోనా నియంత్రణ, చికిత్సకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందిని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి… కొరియా కిట్లు వచ్చాక వ్యాధి కట్టడి ఇంకా తేలికవుతుందని అన్నారు ప్రజలు నిశ్చింతగా ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ పేరొస్తుందోనని మజీ సీఎం చంద్రబాబు ఏడుపు అని ఆరోపించారు.

చంద్రబాబు బీజేపీలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయిస్తారని ఆరోపించారు.. గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేశారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ప్రజలపై ఎందుకింత ద్వేషం? వీళ్ల వెనక ఉన్నదెవరు అని ప్రశ్నించారు…

అలాగే డ్వాక్రా గ్రూపులకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1400 కోట్లు జమ చేయాలని జగన్ ఆదేశించారని అన్నారు. దీని ద్వారా 90.37 లక్షల మంది మహిళలు తక్షణం ప్రయోజనం పొందుతారని అన్నారు. ఏదైనా హామీ ఇస్తే ఎంత త్వరగా నెరవేర్చాలా అని జగన్ ఆరాటపడతారని అన్నారు. ఎలా మోసగించాలా అని చూడటం బాబు నైజం అని ఆరోపించారు. ప్రజలకు ఆ తేడా అర్థమైందని అన్నారు… .