సమంత స్ట్రాటజీ ని ఫాలో అవుతున్న రష్మిక..!!

సమంత స్ట్రాటజీ ని ఫాలో అవుతున్న రష్మిక..!!

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక.. సమంత తర్వాత ఆ రేంజ్ లో బిజీ ఉన్నది ఈమె అని చెప్పుకోవాలి.. ఛలో, గీతగోవిందం లాంటి సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనటించి గ్లామర్ పాత్రలే కాదు ఇలాంటి సినిమా లు కూడా చేస్తానని చెప్పకనే చెప్పింది.. యర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో కూడా లిల్లీ పాత్రకు ప్రాణం పోసింది. ఈ నమ్మకంతోనే ఇప్పుడు సుకుమార్ కూడా తన తర్వాతి సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రంగస్థలం తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. శేషాచలం కొండల నేపథ్యంలోనే ఈ చిత్ర కథను రాసుకున్నాడు సుకుమార్.అయితే ఈ సినిమా లో డీ గ్లామరైజ్డ్‌గా ఉండే ఈ పాత్రలో రష్మికను తీసుకుంటున్నాడు సుకుమార్. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కూడా ఇలాగే ఉంటుంది.

ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఇలాంటి పాత్రలోనే నటించబోతుందని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. బన్నీ కోసం డీ గ్లామర్ పాత్రలో రష్మిక ఎలా కనిపించబోతుందో..? ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..