రక్షిత్ శెట్టి రష్మిక మందన్న ఇద్దరూ మళ్లీ కలుస్తారా

రక్షిత్ శెట్టి రష్మిక మందన్న ఇద్దరూ మళ్లీ కలుస్తారా

0

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో మంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది, ఆమె తెలుగులో గీత గోవిందం సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు.. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వారి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే, చివరకు పెళ్లి చేసుకోకుండానే వారిద్దరూ విడిపోయారు. కాని దీనిపై ఇటీవల రక్షిత్ కూడా మాట్లాడారు ఆమెకు మంచి కెరియర్ ఉంది. ఆమె కలలు వేరు అందుకే ఆమె జీవితం ఆ దారిలో వెళ్లాలి అని కోరుకుంటున్నా అంటూ రక్షిత్ తెలిపాడు.

తాజాగా పెళ్లిపై రష్మిక మరోసారి క్లారిటీ ఇచ్చింది… రక్షిత్ పై ప్రేమ పుట్టిన కారణంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపింది. అయితే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే కారణంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకోవాలని అనుకున్నామని, రెండేళ్లు గడిచిన తర్వాత… సినిమా అవకాశాలు మరింతరావడంతో .. పెళ్లికి సమయం కేటాయించడం సాధ్యం కాలేదని తెలిపింది, తమ పెళ్లి వల్ల నిర్మాతలు నష్టపోతారు అని తాము ఈ నిర్ణయం తీసుకున్నాము అని తెలిపారు. అయితే తర్వాత మళ్లీ విరు కలుస్తారా పెళ్లి చేసుకుంటారా అనే టాక్ కూడా మళ్లీ అభిమానుల్లో స్టార్ట్ అయింది.