ఆ ఇద్దరి హీరోలకి ఢీ తప్పదా..!!

ఆ ఇద్దరి హీరోలకి ఢీ తప్పదా..!!

0

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే సినిమా లో నటిస్తున్న సగంతి తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో కథానాయిక.. నందమూరి బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ రెండు సినిమా ఒకే టైం కి రాబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు.

కాగా ఈ క్రిస్మస్ పోరులో మరో మెగా హీరో జాయిన్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న ప్రతిరోజు పండుగే చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు.

ప్రతిరోజు పండుగే సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది. దీంతో క్రిస్మస్ పోరు బాలయ్య, రవితేజ మరియు సాయి ధరమ్ తేజ్ మధ్య రసవత్తరంగా మారనుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన సాయిధరమ్ ప్రతిరోజు పండుగే ఫస్ట్ గ్లింప్స్ సైతం ఆహ్లాదంగా ఉంది. ఇక అటు బాలయ్య – కేఎస్‌.రవికుమార్ రూలర్ పక్కా బాలయ్య మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌. ఇక రవితేజ – డిస్కోరాజా కూడా మాస్ మూవీనే. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా పైచేయి సాధించి క్రిస్మస్ విన్నర్‌గా నిలుస్తుందో ? మూడు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో ? చూడాలి.