వీడు మాములు దొంగకాదు కార్లు బైకులు అమ్మేవారు జాగ్రత్త ఇది చదవండి

0

చాలా మంది కేటుగాళ్లు అతి తెలివి ప్రదర్శిస్తారు, ఇలాంటివి చదువులో చూపించి ఉంటే మంచి ఉన్నత స్ధితికి వెళతారు కాని చెడు పనులకి మాత్రమే వాడతారు, అమ్రోహాకు చెందిన మనోత్తమ్ త్యాగి అనే వ్యక్తి ఈ కామర్స్ సైట్లలో తన కారు మారుతీ స్విఫ్ట్ అమ్మకానికి పెట్టాడు.

జీతే అనే వ్యక్తి త్యాగిని సంప్రదించాడు. 2,60,000 వేలకు బేరం కుదిరింది. అయితే రెండో తాళం రిజిస్ట్రేషన్ నీ పేరు మీద వారంలో చేయిస్తా అన్నాడు ఈ లోపు 210000 అడ్వాన్స్ ఇచ్చాడు జీతే.. అంతా బాగానే ఉంది మూడు రోజులు అయిన తర్వాత
కారును ఆఫీసు ముందు నిలిపి ఉంచగా త్యాగి దొంగిలించాడు.

తన కారు లేదు అని వెంటనే పోలీసులకి జితే కంప్లైంట్ ఇచ్చాడు… ఆఫీసు బయట ఉన్న సీసీ కెమెరాలు చూశారు అందులో త్యాగి కారు తీసుకువెళ్లడం కనిపించింది. అయితే అతను ఇలా కార్లు అమ్మి తర్వాత దొంగతనం చేసి మళ్లీ వేరేవారికి అమ్మేస్తున్నాడు…కారులో జీపీఎస్ బిగించాడు. దాని ఆధారంగానే కారు ఎక్కడ ఉందో కనుక్కుంటున్నాడు ఈ కేటుగాడు, ఇలా ఏడు కార్లు అమ్మాడట, వారు అందరూ ఇతనిపై ఇప్పుడు కేసులు పెట్టారు, జర జాగ్రత్త కారు అమ్మినా కొన్నా అంటున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here