సమంత మౌనానికి కారణం ఏంటి…?

సమంత మౌనానికి కారణం ఏంటి…?

0

నాగార్జున నటించిన ‘మన్మధుడు 2’ నిన్న విడుదలై మొదటి షో నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ బయ్యర్లలో గుబులు ప్రారంభం అయింది. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల బాగా జరగడంతో నాగార్జునకు ఈ మూవీ విడుదల కాకుండానే భారీ లాభాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ రీత్యా బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా విడుదలై టాక్ బయటకు వచ్చినా ఈ మూవీ పై రివ్యూలు మీడియాలో కనిపిస్తున్నా ఎక్కడా ఈ సినిమా గురించి సమంత ఒక్క కామెంట్ కూడ సోషల్ మీడియాలో చేయకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.

సాధారణంగా సమంత తనకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉంటుందిమన్మధుడు 2′ విడుదలకు ముందు ఆమూవీ టీజర్ ను ట్రైలర్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ కామెంట్స్ చేసిన సమంత నిన్న ‘మన్మధుడు 2’ విడుదల రోజున ఒక్క కామెంట్ కూడ చేయకుండా మౌన ముద్ర వహించింది. దీనితో తన మావగారి పై సమంతకు కోపం వచ్చిందా లేదంటే ‘మన్మధుడు 2’ రిజల్ట్ సమంతకు ముందే తెలుసా అంటూ జోక్స్ పడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే నిన్న విడుదలైన ‘మన్మధుడు 2’ మూవీ పై ఘోరమైన సెటైర్లు పడుతున్నాయి. అద్దె పెళ్ళాం కాన్సెప్ట్ తో ఇప్పటికే చాల సినిమాలు వచ్చిన పరిస్థితులలో ఈమూవీలో ఏమి కొత్తగా చెపుదామని నాగార్జున ఈమూవీని తీసాడు అని అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరికొందరైతే ‘మన్మధుడు’ నాగార్జున కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ అయితే ‘మన్మధుడు 2’ నాగ్ కెరియర్ లో వరస్ట్ మూవీ కావడమే కాకుండా ఈ మూవీ జ్ఞాపకాలను నాగార్జున ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది అంటూ నాగ్ కు సలహాలు వస్తున్నాయి..