రీమేక్ సినిమా లో చిరు.. దర్శకుడు ఎవరంటే..!!

రీమేక్ సినిమా లో చిరు.. దర్శకుడు ఎవరంటే..!!

0

అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా సైరా. వివిధ రకాల భాషల్లో రిలీజ్ అవుతున్న కారణంగా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై పెద్ద చర్చే జరుగుతుంది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల స్టేజి లో ఉండగానే చిరు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులు షెరవేగంగా జరుగుతున్నాయి.. ఇంకో విషయం ఏంటంటే చిరు ఓ రీమేక్ సినిమా లో నటిస్తున్నారని ఈమధ్య వార్తలు వస్తున్నాయి.. కొరటాల శివ సినిమా తర్వాత ఆ సినిమా ఉంటుందని అంటున్నారు..

మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ అనే సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటారు.తాజాగా ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్స్ సందర్భంలో వెల్లడించారు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ మూవీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు.