లోకేష్ ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఇదే

లోకేష్ ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఇదే

0

ఎవరైనా ఓ వార్తని ప్రచారం చేస్తే దానినే అందరూ నమ్ముతారు.. వారు చెప్పిందే కరెక్టు అని భావిస్తారు.. అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విమర్శలు వస్తున్నాయి ..అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి నారాలోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు.. పార్టీ మారి పోయి బయటకు వెళ్లేవారు అందరూ కూడా నారాలోకేష్ పై ఆయన పార్టీని ముందుకు నడపలేరు అనేలా విమర్శలు చేస్తున్నారు.

అంతేకాదు చంద్రబాబు కావాలనే తన తనయుడికి పార్టీ పగ్గాలు ఇచ్చేందు కోసం రాజకీయాలు చేస్తున్నారు అని విమర్శించారు. పదవి ఇవ్వడానికి లోకేష్ కు అర్హత లేదు అని విమర్శలు చేశారు.. అయితే వైసీపీ నేతలు కూడా అదే విమర్శలు చేస్తున్నారు.. అంతేకాదు పార్టీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ కూడా ఇవే ఆరోపణలు చేశారు ..

అయితే కావాలనే లోకేష్ ని టార్గెట్ చేసి ఇలా విమర్శలు చేసి, ఈ ఐదు సంవత్సరాలలో లోకేష్ ని రాజకీయంగా దెబ్బతీయాలి అని, మరోసారి కూడా టీడీపీ గెలవకుండా కావాలనే లోకేష్ ని టార్గెట్ చేశారు అని టాక్ అయితే టీడీపీలో నడుస్తోంది.. ఇలాంటి విమర్శలు లోకేష్ అలాగే టీడీపీ నేతలు పట్టించుకోకుండా ఉంటే బెటర్ అని చాలా మంది సీనియర్లు చెబుతున్నారు.