రిచా గంగోపాధ్యాయ్ కి పెళ్లి అయిపోయింది వరుడు ఎవరంటే

రిచా గంగోపాధ్యాయ్ కి పెళ్లి అయిపోయింది వరుడు ఎవరంటే

0

అందానికి అందం – అభినయానికి అభినయం అంటే వెంటనే గుర్తు వచ్చేపేరు నటి రీచా గంగోపాధ్యాయ్, ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆమె సినిమాలకు అభిమానులు ఘనంగానే ఉన్నారు. అయితే ఇటీవల ఆమె సినిమాకు కాస్త దూరంగానే ఉంటోంది, ఆమె మిరపకాయ, మిర్చి సినిమాలో నటించింది.. ఈమెకు ఈ సినిమా మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. అంతేకాదు లీడర్ సినిమాలో కూడా రానా సరసన నటించింది. అంతేకాదు తమిళ్ లో కూడా పలు సినిమాలు చేసింది నటి రీచా గంగోపాధ్యాయ్.

తాజాగా ఈ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ పెళ్లి చేసుకుంది అని తెలుస్తోంది. అమెరికా యువకుడు జో తో ఆమె వివాహం ఘనంగా జరిగింది. భారతీయ హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి నిర్వహించారు. ఆమె పెళ్లికి కేవలం వారి కుటుంబ సభ్యులు జో కుటుంబ సభ్యులు మాత్రమే హజరయ్యారు.

అమెరికాలో ఓ విద్యాసంస్థలో పరిచయమైన జోతో ఆమె ప్రేమలో పడింది. వీరి ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో కొంతకాలం కిందట నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మరో బ్యూటీకి పెళ్లి అయింది అనేది వార్త.