బాలయ్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ రోజా

బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫైర్ బ్రాండ్ రోజా

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…. అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైమ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ….. బాలకృష్ణకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళాకారులకు అన్యాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు….

అలాగే టీడీపీ నేత ఎమ్మెల్సీ లోకేశ్ ను చూసి వైసీపీ మంత్రులు కాళ్లు వనుకుతున్నాయని అంటున్నారని తన కాళ్లు కూడా వనుకుతున్నాయని ఎద్దేవా చేశారు…. లోకేశ్ కు మంగళగిరి పలుకడం రాక ట్యూషన్లు పెట్టించుకున్నారని అన్నారు…

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎద్దేవా చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు….