రోజుకి 20 ల‌క్ష‌ల మందికి భోజ‌నం పెడుతోంది ఆసంస్ధ హ్యాట్సాఫ్ చెయ్యాల్సిందే

రోజుకి 20 ల‌క్ష‌ల మందికి భోజ‌నం పెడుతోంది ఆసంస్ధ హ్యాట్సాఫ్ చెయ్యాల్సిందే

0

నిత్యం ఈ లాక్ డౌన్ వేళ కూలీల‌కు ఆక‌లితో ఉన్న పేద‌ల‌కు సాయం అందిస్తున్నారు చాలా మంది.. అలాగే నిత్య అవ‌స‌రాలు కూడా అందిస్తున్నారు, ఈ స‌మ‌యంలో పేద‌ల‌కు సాయం చేయ‌డంతో ప‌లువురు వాలంటీర్ గా ముందుకు వ‌స్తున్నారు.. ఫుడ్ వండి వారికి ప్యాకింగ్ చేసి అందిస్తున్నారు.. మ‌రికొంద‌రు నిత్య అవ‌స‌రాలు ప్యాకింగ్ చేసి కిట్ రూపంలో ఇస్తున్నారు.

ఇలా కార్పొరేట్ కంపెనీలు కూడా తోచిన సాయం చేస్తున్నాయి. విప్రో కంపెనీ ఇప్పటికే రూ. 1,125 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఆ సంస్థ అక్కడితోనే ఆగిపోలేదు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీరుస్తోంది.

అయితే అత్యంత ఎక్కువ‌గా ఏ కార్పొరేట్ కంపెనీ చేయ‌ని సాయం చేస్తోంది, దాదాపు రోజుకి ఆ సంస్ద 20 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు ఆహ‌రం అందిస్తోంది.ఈ విష‌యాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్వీట్ చేశారు.
చాలా మంది ఈ క్రైసిస్ స‌మ‌యంలో సాయం చేస్తున్నార‌ని, అలాంటి వారు అంద‌రికి కూడా ధ‌న్య‌వాదాలు తెలిపారు, ఇంకా పేద‌ల‌ను ఆదుకోవాల‌ని ప‌లువురు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు.