ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫైనాన్షియర్ ఎవరో తెలుసా

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఫైనాన్షియర్ ఎవరో తెలుసా

0

ఆర్ఆర్ఆర్ , రాజమౌళి , ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ..ఇటు ముగ్గురు అభిమానులు ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ కాంబినేషన్ పై ఏ వార్త వచ్చినా సంచలనం అవుతోంది. బాహుబలి, సాహో, సైరా ల తరువాత అత్యంత భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోంది ఈ చిత్రం.

ఈ చిత్రానికి నిర్మాత దానయ్య, అయితే ఈ చిత్రానికి ఫైనాన్స్ అంటే మాములు విషయం కాదు దీనికోసం నిర్మాత కూడా పలువురు ఫైనాన్షియర్ల దగ్గరకు వెళ్లాలి.. ఇక గతంలో బాహుబలి 2 కు మ్యాట్రిక్స్ ప్రసాద్ తక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేసారు. ఈసారి కూడా అత్యంత తక్కువ వడ్డీకి ఫైనాన్స్ కోసం ప్రయత్నించారు ఆయన ఒకే చేశారు అని తెలుస్తోంది.

ఇక రాజమౌళి పేరుమీద షూరిటీగా ఈ పెట్టుబడి ఇచ్చారట, దీంతో గతంలో ఇచ్చిన మాటమీద దానయ్యకు రాజమౌళి సినిమా చేస్తున్నారు, ఇక ఈ సినిమాకి మార్కెటింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది.. ఆంధ్రాలోనే 100 కోట్లకి అడుగుతున్నారు దానికి కూడా అడ్వాన్సులతో నలుగురు రెడీగా ఉన్నారు .అది జక్కన్న సినిమా రేంజ్ అంటున్నారు అభిమానులు.