బ్రేకింగ్ — రష్యా నుంచి రెండో వ్యాక్సిన్ డేట్ ఇచ్చిన అధ్యక్షుడు

బ్రేకింగ్ -- రష్యా నుంచి రెండో వ్యాక్సిన్ డేట్ ఇచ్చిన అధ్యక్షుడు

0

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, దాదాపు 10 నెలల నుంచి ప్రపంచం ఈ విషపు కోరల్లో ఉంది, అయితే కోట్లాది మందికి సోకడం లక్షలాది మంది మరణించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

ఇక ఈ వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు..ప్రపంచంలోనే మొదటి కొవిడ్ టీకాను రిజిస్టర్ చేసిన రష్యా రెండో టీకాను కూడా నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పుడు రష్యా దూకుడికి అందరూ షాక్ అవుతున్నారు, ఇప్పటికే రష్యా ఓ టీకాని విడుదల చేసింది, ఆ దేశంలో ప్రజలకు ఇస్తోంది కూడా.

రష్యా మొదట రిజిస్టర్ చేసిన వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వీ. దీన్ని ఆగస్టు 11న నమోదు చేసింది.
తాజాగా సైబీరియాకు చెందిన వెక్టర్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన రెండో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను ఇటీవల పూర్తిచేసిందట. ఈ వ్యాక్సిన్ పేరు ఎపివాక్ కరోనా అని చెబుతున్నారు.అక్టోబర్ 15 లోగా రిజిస్టర్ చేస్తామని చెబుతోంది రష్యా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here