ప్రభాస్ ఉండగా.. టాక్ తో సంబంధమేంటి సాహో’ 4 రోజుల కలెక్షన్స్.. 60 శాతం వసూళ్లు!

ప్రభాస్ ఉండగా.. టాక్ తో సంబంధమేంటి సాహో’ 4 రోజుల కలెక్షన్స్.. 60 శాతం వసూళ్లు!

0

ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ’సాహో’. ఆగష్టు 30న విడుదలయ్యింది. ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. ’బాహుబలి2’ తరువాత రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి ప్రభాస్ ఇలాంటి సినిమా చేయుడం ఏంటి అనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ హై రేంజ్ యాక్షన్ వాల్యూస్ కు, ప్రభాస్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ’ప్రభాస్ ఉండగా.. టాక్ తో సంబంధమేంటి’ అంటూ ప్రభాస్ అభిమానులు ’సాహో’ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 4 రోజుల కలెక్షన్లు అదిరిపోయాయి.

ఫస్టు డే ఏకంగా 130 కోట్లతో షేక్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు మరో 70 కోట్లుతో సరిపెట్టుకుంది. మూడు, నాలగు ఈ రెండు రోజులు కూడా సాహో దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజులకు మొత్తం 320 కోట్ల గ్రాస్ తెచ్చుకుంది ఈ సినిమా. షేర్ రూపంలో లెక్క గడితే దాదాపు 170 కోట్ల వరకూ ఉండొచ్చు. ఫస్టు డే నే బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టింది సాహో. నైజాంలో సాహో దుమ్ము దులుపుతోంది. ప్రస్తుతం నైజాంలో రూ.20 కోట్లు వసూలు చేసింది సాహో. ’సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి ఎంత డిజాస్టర్ రివ్యూలు వచ్చినా తెలుగు కంటే ఎక్కువగా హిందీలో వసూళ్ళు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.