సాహో పట్ల ఎక్కువగా ఉహించుకుంటున్నారేమో..?

సాహో పట్ల ఎక్కువగా ఉహించుకుంటున్నారేమో..?

0

బాహుబలి నుండి ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం సాహో. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెలుగు , తమిళ్ , హిందీ, మలయాళం భాషల్లో తెరకెక్కించారు. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిగా సినిమాను సుజిత్ రూపుదిద్దినట్లు చిత్ర టీజర్స్ , స్టిల్స్ చెప్పకనే చెపుతున్నాయి. ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండడం తో ఫస్ట్ డే అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు..మొదటి రోజు ఒక్క తెలుగు వెర్షన్ నుంచే 125 కోట్ల దాకా వసూళ్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజవుతుంది కాబట్టి ఎంతలేదన్నా ఫైనల్ రన్ అయ్యేలోపు 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా వినికిడి. వీరి లెక్కలు చూసిన ప్రతి ఒక్కరు ఇది జరిగే పనేనా అని మాట్లాడుకుంటున్నారు.

ఏదో బాహుబలి సినిమా వసూళ్లు చేసింది కదా అని ప్రతి సినిమా బాహుబలి అవుతుందని లెక్కలు వేసుకుంటే ఎలా..? బాహుబలి ఫాంటసీ మూవీ కావడం తో మొదటి నుండే ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం..ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండడం తో భారీ వసూళ్లు రాబట్టగలిగింది. కానీ సాహో ఆలా కాదు కదా..మొదటి నుండి యాక్షన్ భరిత చిత్రమే అని తెలిసిపోతుంది. దీనిబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారని ఎలా ఊహించుకుంటారు..యాక్షన్ తగ్గట్లు కథ ఉండాలి కదా..అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి సాహో ఏం చేస్తాడో చూడాలి.