సాహో వాయిదా.. రంగంలోకి రణరంగం, ఎవరు..!!

సాహో వాయిదా.. రంగంలోకి రణరంగం, ఎవరు..!!

0

ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘సాహో’ చిత్రాన్ని 30వ తేదీకి వాయిదా పడింది. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘రణరంగం’ సినిమా ఆగస్టు 15న వస్తోంది. శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్ హీరోయిన్స్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న ‘ఎవరు’ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌. వెంకట్‌ రాంజీ దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గూఢఛారి’ తర్వాత అడివి శేష్‌ పూర్తిస్థాయిలో నటించిన సినిమా ఇది. మరి ఈ రెండు చిత్రాలు ఏ మేరకు విజయాన్ని సాధిస్తాయో చూడాలి.