‘సాహో’ సూపర్‌ -ఉమైర్‌ సంధు

'సాహో' సూపర్‌ -ఉమైర్‌ సంధు

0

సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఈ మూవీ 30వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తయింది. 2.51 గంటల నిడివి వున్న చిత్రం అద్భుతంగా ఉందని యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమైర్‌ సంధు వరుస ట్వీట్లు పెట్టారు.

పెద్ద సినిమాల విడుదలకు ముందు తొలి రివ్యూను ఇచ్చే ఉమైర్‌, చిత్రం సూపరని చెప్పాడు.
తొలి సగ భాగం తరువాత ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారని, ప్రభాస్‌ ఎంట్రీతోనే సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయని అన్నాడు. యాక్షన్‌ సీన్స్‌, ఛేజింగ్‌ లు మతి పోగొట్టేలా ఉన్నాయని, ఈ పాత్రలో ప్రభాస్‌ ను తప్ప మరొకరిని ఊహించుకోలేం.

ఈ సినిమా సాలిడ్‌ ఎంటర్‌ టెయినర్‌ అని, అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ వినోదమే ఉందని తెలిపాడు. గత రికార్డులను కొల్లగొట్టే బ్లాక్‌ బస్టర్‌ అంటూ పొగడ్తలు కురిపించారు. కాగా ఉమైర్‌ సంధు రివ్యూలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.