సాహో సినిమా లో ఆ సీస్ అస్సలు మిస్ అవ్వొద్దట..!!

సాహో సినిమా లో ఆ సీస్ అస్సలు మిస్ అవ్వొద్దట..!!

0

సాహో సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఈనెల 15 వ తేదీతో ముగిసింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండటంతో పోస్ట్ ఫోన్ చేశారు. ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా కొంచం ఆలస్యంగా అంటే ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం మూడు గంటల సినిమాలో 40 నిమిషాల పాటు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని థ్రిల్ కు గురిచేస్తాయని యూనిట్ భావిస్తోంది. యాక్షన్ సన్నివేశాలే సినిమాకు హైలైట్ గా ఉంటాయని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తున్నది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.