సాహో ట్రైలర్: గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడు .. స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది

సాహో ట్రైలర్: గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడు .. స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అఫిషియల్ ట్రైలర్ ని విడుదల చేసారు .. ఇప్పటికే టీజర్ , పోస్టర్స్ తో ఆకట్టుకున్న సాహో .. ఇప్పుడు ట్రైలర్ తో మనముందుకు వస్తుంది .. ఇక ట్రైలర్ లో అన్ని అంశాలను కవర్ చేసారు .. యాక్షన్ , రొమాన్స్, లవ్ , అన్ని పర్ఫెక్ట్ గా చూపించారు .. బాహుబలి చిత్రం తరువాత లాంగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఈ చిత్రాన్ని చేస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ సుందరి శ్రద్ధా కపూర్ నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌కు సంబంధించిన ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధాకపూర్ లుక్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఈ చిత్రంలోని ఇతర కీలకపాత్రల్ని రివీల్ చేశారు. వెన్నెల కిషోర్ ,మందిరా బేడీ ,ఇవాలియన్ శర్మ, మురళీశర్మ, జాకీ ష్రాఫ్, తిన్ను ఆనంద్, మంజ్రేకర్ మహేష్, లాల్ తదితరులు క్యారెక్టర్‌లు వారి లుక్స్‌ను విడుదల చేశారు.