లోకేష్ ని దారుణంగా టార్గెట్ చేసిన సాయిరెడ్డి

లోకేష్ ని దారుణంగా టార్గెట్ చేసిన సాయిరెడ్డి

0

మొత్తానికి వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి ఇటు తెలుగుదేశం యువనాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ పై దారుణమైన టార్గెట్ విమర్శలు చేస్తున్నారు..పర్సనల్ అటాక్ విమర్శలు వద్దు అని చెబుతున్నా లోకేష్ పై వైసీపీ నేతలు అవే విమర్శలు చేస్తున్నారు, తాజాగా మళ్లీ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్ది దారుణంగా లోకేష్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

పప్పూనీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్మీట్లలో ఫ్రస్టేట్ అవుతున్నాడు..

అయితే తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై తీవ్రమైన స్ధాయిలో ఆరోపణలు ఖండనలు చేస్తోంది.. మొత్తానికి రాజకీయంగా ఎన్ని విమర్శలు ఆరోపణలు చేసుకున్నా పర్వాలేదు కాని పర్సనల్ అటాక్ ఫ్యామిలీని లాగడం లాంటివి రాజకీయంగా చేయకూడదు అంటున్నారు మేధావి వర్గం.