మళ్ళీ ఆ హీరోయిన్ తో సినిమా చేయనున్న సంపత్ నంది..!!

మళ్ళీ ఆ హీరోయిన్ తో సినిమా చేయనున్న సంపత్ నంది..!!

0

గోపీచంద్ హీరోగా సంపత్ నంది ఓ సినిమా చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమా లో హీరోయిన్ గా తమన్నాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే దర్శకుడు సంపత్ నంది మాత్రం ఒక హీరోయిన్ ను రిపీట్ చేస్తుంటాడు.

సంపత్ నంది మొదటి సినిమా ఏమైంది ఈవేళ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రచ్చ సినిమా చేశాడు. ఆ సినిమా నుండి గౌతం నంద వరకు చేసిన సినిమాల్లో తమన్నాని రిపీట్ చేస్తూ వచ్చాడు.అయితే తాజాగా చేయబోతున్న గోపీచంద్ సినిమా లో కూడా ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడట.

రచ్చ సినిమా టైంలో టాలీవుడ్ కు మరో క్రేజీ మాస్ డైరక్టర్ వచ్చాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత బెంగాల్ టైగర్ పర్వాలేదు అనిపించినా గౌతం నంద మాత్రం సంపత్ నంది ఇమేజ్ డ్యామేజ్ చేసింది. మరి ఈ సినిమా తో సంపత్ నంది హిట్ కొడతాడా అనేది చూడాలి..