శాంసంగ్ భారీ విరాళం నిజంగా గ్రేట్ అంటున్న జ‌నం

శాంసంగ్ భారీ విరాళం నిజంగా గ్రేట్ అంటున్న జ‌నం

0

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈవైర‌స్ మ‌హ‌మ్మారి త‌న ఉగ్ర‌రూపం చూపుతోంది, ఈ స‌మ‌యంలో వైర‌స్ పై యుద్దానికి కేంద్రం ముందుకు వ‌చ్చింది, అంతేకాదు ప‌లువురు పెద్ద‌లు వ్యాపారులు విరాళాలు అందిస్తున్నారు స‌ర్కారుకి.

ఈ వైర‌స్ పై పోరులో పేద‌ల‌కు ఆక‌లితీరుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే మెడిక‌ల్ ఎక్విప్ మెంట్స్ అందిస్తున్న వారు ఉన్నారు, అనేక ప్ర‌ముఖ టెక్ కంపెనీలు కోవిడ్ పై పోరుకి సాయం చేశాయి.
తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఇండియా కరోనా ఫైట్ కి సాయం అందించింది.

కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.20 కోట్లు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్లు ఇస్తున్నట్టు వివరించింది. దీనిపై ప్ర‌ధాని మోదీ కూడా వారిని అభినందించారు.