సంచలనం వైసీపీలోకి బాలయ్య బెస్ట్ ఫ్రెండ్

సంచలనం వైసీపీలోకి బాలయ్య బెస్ట్ ఫ్రెండ్

0

2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి… టీడీపీ రాష్ట్రంలో పుంజుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో చాలామంది తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు

ఇప్పటికే పలువురు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే ఇదే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బెస్ట్ ప్రెండ్ కూడా ఛాన్స్ దొరికితే టీడీపీకి టాటా చెప్పేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి….

సుమారు 15 సంవత్సరాలపాటు బాలయ్యకు అత్యంత సన్నిహితుడు టీడీపీ పిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న కదిరిబాబు రావు ఇప్పుడు గోడదూకేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కనిగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు…

2019 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గంలో పోటీ చేయాలని చూశారు కానీ చంద్రబాబు నాయుడు దర్శికి నుంచి పోటీ చేయించారు… దీంతో ఆయన ఓటమి పాలు అయ్యారు…ఇక అప్పటినుంచి ఆయన చంద్రబాబు పై గుర్రున ఉన్నారని వార్తలు వస్తున్నాయి…