అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంట్లో విషాదం

అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంట్లో విషాదం

0

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ సందీప్ వంగ ఇంట విషాదం. సందీప్ తల్లి వంగ సుజాత గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. వరంగల్ వెంకటయ్య కాలనీలో నివసిస్తున్న ఆమె తన స్వగృహంలో కన్నమూశారు. పలువురు ఆమెకు నివాళులర్పించారు.

సందీప్ అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే అక్కడ కూడా ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. త్వరలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించను న్న ట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం స్క్రిప్ట్ పనులలో బిజీ గా ఉన్నారు.