సంక్రాంతి పండుగకు మరో పేరు కూడా ఉంది… ఆ పేరు ఏంటో తెలుసా

సంక్రాంతి పండుగకు మరో పేరు కూడా ఉంది... ఆ పేరు ఏంటో తెలుసా

0
45

సంక్రాంతి పండుగను సౌత్ ఇండియాలో అంగరంగా వైభవంగా జరుపుకుంటారు… ప్రపంచంలో ఏ మూలన జాబ్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నాకూడా కచ్చితంగా తమ స్వగృహాలకు చేరుకుని కుటుంబసభ్యులతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు….

గతంలో నాలుగు రోజులు సంక్రాంతి పండుగను జరుపుకునేవారు… భోగీ, మకరసంక్రాంతి అలాగే కనుమ, ముక్కనుమ జరుపుకునే వారు కానీ ఇప్పుడు, భోగీ, మకరసంక్రాంతి అలాగే కనుమ పండుగను మాత్రమే జరుపుకుంటున్నారు… కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమను కూడా జరుపుకుంటారు… ఈ పండుగకు ప్రతీ ఒక్కరు కొత్తబట్టలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది…

ఈ పండుగను రైతు పండుగా అలాగే పెద్ద పండుగా అని కూడా అంటారు…. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి.

పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే – ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా అలాగే కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు