సరికొత్త పాత్రలో చైతూ సినిమా

సరికొత్త పాత్రలో చైతూ సినిమా

0

అక్కినేని వారసుడు యంగ్ హీరో నాగచైతన్య మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.. దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నారు, ఇది రొమాంటిక్ జోనర్ అని తెలుస్తోంది, అంతేకాదు ఇప్పటివరకూ చైతూ చేయని ఓ కథ అని తెలుస్తోంది ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి బేస్ లో కనిపిస్తుందట.

ఇందులో పల్లెటూరు కుర్రాడిలా కనిపిస్తాడట చైతూ , అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ పల్లెటూరి కుర్రాడిగా అదే యాసతో మాట్లాడనున్నాడు.. అంతేకాదు ఈ పాత్ర కోసం చైతూ తెలంగాణ యాసను నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం అంటే ఏదో నామమాత్రానికి కాదు.. యాసపై పూర్తిగా పట్టు సాధించేలా కష్టపడుతున్నాడట.

ఇక ఆయనకు తో సాయిపల్లవి నటిస్తోందట, అయితే సాయిపల్లవి ఫిదాలో నటనతో అదరగొట్టిన విషయం తెలిసిందే.. భానుమతి క్యారెక్టర్ ఎవరూ మర్చిపోలేరు. హైదరాబాద్ వచ్చిన యువత గురించి వారు జీవితంలో అనుకున్నది సాధించారా లేదా అనే బేస్ తో కథ ఉంటుంది అని తెలుస్తోంది.