సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు కలెక్షన్లు దుమ్ముదులిపేశాయి

సరిలేరు నీకెవ్వరు మొదటి రోజు కలెక్షన్లు దుమ్ముదులిపేశాయి

0

ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు.. అందరూ ఊహించినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అని తొలిరోజే ప్రేక్షకులు తేల్చేశారు. అమెరికా నుంచి ఆంధ్రా వరకూ మహేష్ ఫ్యాన్స్ సంబురాలు చేస్తున్నారు హైదరాబాద్ విశాఖ విజయవాడ నిజామాబాద్ వరంగల్ ప్రాంతాల్లో బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అని అప్పుడే బ్యానర్లు వేసేశారు, రోజుకి ఆరుషోలకు పర్మిషన్ ఇవ్వడంతో సినిమా ధియేటర్స్ లో అన్నీ షోలకు టికెట్స్ ముందుగానే బుక్ అయ్యాయి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను ఉదయం ప్రదర్శించారు. అప్పుడే బాక్సాఫీస్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. తొలిరోజే అద్బుతమైన చిత్రంగా పేరు సంపాదించింది.దాదాపు తొలిరోజు ఆయన సినిమా వసూళ్లు 55 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు… అయితే బిజినెన్ ప్రీ రిలీజ్ కి 100 కోట్లు అయింది అంటున్నారు, అయితే ఈ సినిమా పండుగ వారం రోజులు ఖాళీ లేకుండా ఉంటుంది కాబట్టి సుమారు 200 కోట్ల పైనే వసూళ్లు సాధిస్తుంది అని చెబుతున్నారు ట్రేడ్ పండితులు,

అయితే దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్న విధంగా చిత్ర యూనిట్ పెట్టుకున్న ఆశలు ఫ్యాన్స్ సినిమా ప్రేక్షకులు నిజం చేశారు మరోపక్క ఆయన గత రికార్డులు మార్చే సినిమా అని ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నారు.