సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి చిరు బ్లెస్సింగ్స్

సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి చిరు బ్లెస్సింగ్స్

0

సరిలేరు నీకెవ్వరూ చిత్రం సరికొత్త అప్ డేట్స్ తో వస్తోంది. మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం పాటలు టీజర్ దుమ్ముదులుపుతున్నాయి, ఇక సినిమా షూటింగ్ కూడా ఇటీవల పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్, మహేష్ కూడా షూటింగ్ కు ప్యాకప్ చెప్పారు.

ఇక చాలా వరకూ ఎడిటింగ్ వర్క్ అవుతోంది, చివరి ఎండింగ్ వర్క్ మాత్రమే ఫినిషింగ్ లో ఉంది అని తెలుస్తోంది..
సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు అని ప్రకటించింది చిత్ర యూనిట్ .

నిన్న ఓ సర్ ఫ్రైజ్ అని చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా దీనిని రివీల్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. 2020 ఏడాది ఆరంభంలో అతిపెద్ద సంరంభానికి మరింత వన్నె తీసుకువచ్చేలా చిరంజీవి గారు సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ట్వీట్ చేసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా నిలుస్తోంది.జనవరి 11న సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెండితెరపై సందడి చేయనుంది.