సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణ లోడ్ ఎత్తాలిరా ఈ డైలాగ్ చెప్పిన ఆయన ఎవరో తెలుసా

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణ లోడ్ ఎత్తాలిరా ఈ డైలాగ్ చెప్పిన ఆయన ఎవరో తెలుసా

0

సినిమాలో కథలో కొత్తదనంతో పాటు కచ్చితంగా కామెడీ కూడా సరికొత్తగా ఉండాలి.. అప్పుడే స్టోరీలు కంటెంట్ తో పాటు సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.. తాజాగా సంక్రాంతికి విడుదల అయిన చిత్రాలు అల వైకుంఠపురములో సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో కామెడీ ట్రాక్ కూడా సూపర్ అని చెప్పాలి మరీ ముఖ్యంగా.. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయి సక్సెస్ ట్రాక్ లో వసూళ్లతో దూసుకుపోతోంది…. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో రమణ లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడుద్ది అంటూ డైలాగ్స్ చెప్పి పవర్ఫుల్ ఫైట్ లో ఓ పెద్దాయన మెరిశాడు. అబ్బో అడవిలో అదరగొట్టాడు పెద్దాయన.. ఆ సినిమాలో డైలాగుకి ఆయన తాడులు నేసే పద్దతికి , అక్కడ బాయ్స్ చేసే సైలెంట్ వర్క్ కి అందరూ ఫిదా అయ్యారు.

ఈ పెద్దాయన పేరు కుమనన్ సేతురామన్. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉండే సేతురామన్ చెన్నై నుంచి వైజాగ్ కి 1984 వ సంవత్సరం లో వచ్చారు. ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమట.. సినిమాలు చేయాలనే కోరిక ఉండేదట..సినీ ఇండస్ట్రీ కి వెళ్లి మెంబెర్ షిప్ కార్డు తీసుకున్నారుట.. ఒక సినిమా షూట్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చిన డైలాగ్ ని సరిగ్గా చెప్ప లేకపోయాడట.

అప్పుడు సేతురామన్ ను డైరెక్టర్ పిలిచి చెప్పమన్నారట. ఆ డైలాగ్ వేంటనే సేతురామన్ చెప్పడంతో వెంటనే సేతురామన్ ఆ సినిమాకి తీసుకున్నారట…అరవింద్ 2 లో కూడా కనిపించారు. సురేందర్ రెడ్డి సైరా సినిమా రూపం లో ఛాన్స్ దక్కింది. ఇప్పుడు సరి లేరు నీకెవ్వరూ లో కుడా చేసారు.మరి సినిమా చూశారుగా రమణ లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడుద్ది అనే డైలాగ్ మరి సేతురామన్ ఎలా చెప్పారు… ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత మళ్లీమహేష్ బాబు కూడా అదే హవభావాలతో చెప్పారు ..అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆయన స్టైల్ నచ్చింది.