ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ నటులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ నటులు

0

సినిమాల నుంచి టెలివిజన్ వరకూ చాలా మంది నటులు తమ ఇష్టాలకు ప్రయారిటీ ఇస్తారు, వారిని నచ్చిన జీవితం బ్రతకడమే కాదు వారిని

నచ్చిన భాగస్వామిని వెతుక్కుంటారు.. సినిమా అనే రంగుల ప్రపంచంలో పనిచేస్తూనే తమ జీవితం కూడా రంగులమయం చేసుకుంటారు. చాలా మంది, సినిమా నటుల్ని.. సీరియల్ నటుల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపించకపోయినా, కొందరు మాత్రం వారే తమకు తగిన వరుడు అంటారు,

అవును చూపులు కలిసిన శుభవేళ పెళ్లికి కూడా శుభం కార్డ్ వేసిన జంటలు ఎన్నో ఉన్నాయి, సినిమా నటులు టెలివిజన్ నటులు ఇలా ఎందరో

తమ భాగస్వామిని తమ పని చేసేచోట వెతుక్కున్న వారు ఉన్నారు. మరి అలాంటి వారిలో సీరియల్ జంటలు కూడా కొన్ని ఉన్నాయి.

మనసు మమత సీరియల్ లో నటించిన ప్రియతమ్ చరణ్, మానస ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. చంద్రముఖి సీరియల్ లో నటిస్తున్నప్పుడు పరిటాల నిరుపమ్, మంజుల ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు మహేశ్వరీ, శివనాగ్ జంట కూడా పెళ్లి చేసుకున్నారు సీరియల్స్ లోపనిచేస్తూ..ఇక వీరు సీరియల్స్ చేస్తున్న సమయంలో వీరితో చాలా సేపు అక్కడ టైం స్పెండ్ చేయడం వారి ఇష్టాలు తెలుసుకోవడం ,వారి కుటుంబాలు అలాగే వారి అలవాట్లు అవతల వ్యక్తులతో వీరు ఉండే విధానం అన్నీ పరిశీలించి ముఖ్యంగా నటీమణులు అబ్బాయిలని సెలక్ట్ చేసుకున్నారు అనే చెప్పాలి.. అపరంజి, అనుబంధాలు, ఇద్దరమ్మాయిలు తదితర సీరియల్స్ లో నటించిన సీనియర్ హీరోయిన్, వెండితెర హీరోయిన్ సుహాసిని తనతో కలిసి ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటించిన ధర్మని వివాహం చేసుకుంది.