‘శభాష్​ మిథు’ ట్రైలర్​ రిలీజ్..నటనతో అదరగొట్టిన తాప్సీ (వీడియో)

0

భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘శభాష్‌ మిథు’. తాప్సీ టైటిల్​ రోల్​ పోషించగా శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు. చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. ఇలాంటి అంశాల కలయికతో ఈ సినిమా తెరకెక్కింది.

జులై 15న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. “మెన్‌ ఇన్‌ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్‌ ఇన్‌ బ్లూ అనే ఓ టీమ్‌ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను” అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం మనసుని హత్తుకునేలా ఉంది. ఇక, మిథాలీ రాజ్‌గా తాప్సీ నటన అదరగొట్టేసింది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=FLd_ZeEe9pc&feature=emb_title

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here