ఆ సంస్థతో షాలిని పాండే ఒప్పందం

ఆ సంస్థతో షాలిని పాండే ఒప్పందం

0

అరుజున్ రెడ్డితో ఆకట్టుకునే అరంగ్రేటం చేసింది షాలిని పాండే. ఈ సినిమాతోనే కుర్రకారు మనసులను లాగేసుకుంది ఈమె. అరుజున్ రెడ్డి మంచి విజయాన్ని రాబట్టినప్పటికీ ఈ అమ్మడుకి టాలీవుడ్ లో మల్లి అంత మంచి పాత్ర రాలేదనే చెప్పాలి. అయితే ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్లో జాక్పాట్ సాధించింది.

యస్ రాజ్ ఫిల్మ్ బ్యానర్లో మూడు భారీ సినిమాల్లో చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఈ నటి. ఈ మూడింటిలో ఒక సినిమాలో ఆమె రన్ వీర్ సింగ్ కి జోడిగా కనిపించనుందట. ఈ మూడు సినిమాలతో షాలిని దశ మారిపోతుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.