వైయస్ కు ముందు మండలి ఏర్పాటు చేయాలని ఎవరు అనుకున్నారు ఏం జరిగింది

వైయస్ కు ముందు మండలి ఏర్పాటు చేయాలని ఎవరు అనుకున్నారు ఏం జరిగింది

0

ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతున్న విషయం మండలి రద్దు, అయితే ఇది రద్దు కాని పునరుద్ధరణ కాని అంత ఈజీ కాదు అంటున్నారు సీనియర్లు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాదులు… అయితే శాసన సభలో తీర్మానం సులువే ..ఆ తర్వాత అంతా కేంద్రం ఇష్టం
ఎన్టీఆర్ యత్నాలకు ఇందిర అడ్డుపడ్డారు అనేది తెలిసిందే,

రాజీవ్ వచ్చాకే మండలి రద్దుకు ఓకే చెప్పారు. ఆపై 22 ఏళ్లపాటు రద్దులోనే సభ ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ నేత తలుపులు తెరిపించలేకపోయారు ఆయనే మర్రి చెన్నారెడ్డి.. చివరకు వైఎస్ అనుకున్నా మూడేళ్లకే విజయం సాధించారు. ఎన్టీఆర్ రద్దు చేసిన తర్వాత 1989లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. శాసన మండలిని పునరుద్ధరించాలని నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి భావించారు.

దీనికోసం చాలా తాపత్రయ పడ్డారు, 1990లో శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కానీ… కేంద్రంలో పరిస్థితులు సహకరించలేదు. దీనికి కారణం… అప్పుడు వరుసగా కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఈ బిల్లును ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత లోక్సభకు పంపించారు. ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు రావడంతో లోక్సభలో ఈ బిల్లు మురిగిపోయింది. తర్వాత ఏపీలో టీడీపీ రావడంతో మండలి గురించి పట్టించుకోలేదు.