ఆ సినిమా పై ఇంట్రెస్ట్ లేక ఆపేసిన శేఖర్ కమ్ముల..!!

ఆ సినిమా పై ఇంట్రెస్ట్ లేక ఆపేసిన శేఖర్ కమ్ముల..!!

0

కొత్తవాళ్లతో సినిమాలు తీసి భారీ విజయాలు సాధించడం శేఖర్‌ కమ్ముల స్టయిల్‌. అతనితో పని చేయాలని మహేష్‌ బాబు లాంటి హీరోలు ఆసక్తి చూపించినా కానీ అతను మాత్రం కొత్తవాళ్లతో సినిమాలకే కట్టుబడ్డాడు. ‘ఫిదా’ చిత్రానికి కూడా సాయిపల్లవి తెలుగు ఇండస్ట్రీకి కొత్తే. వరుణ్‌ తేజ్‌కి కూడా అప్పటికి అంత పేరేమీ లేదు. కొత్త వాళ్లతో చేయడం కంఫర్టబుల్‌గా ఫీలయ్యే శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’ తర్వాత కూడా కొత్తవాళ్లతోనే సినిమా మొదలు పెట్టాడు.

50 శాతం చిత్రీకరణ పూర్తయిన తరువాత, హఠాత్తుగా ఆయన చైతూ – సాయిపల్లవిలతో తన కొత్త సినిమాను ప్రకటించాడు. దాంతో ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా పూర్తయిన తరువాత, చైతూ సినిమాను మొదలెడతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్తవాళ్లతో మొదలుపెట్టిన సినిమాను శేఖర్ కమ్ముల ఆపేశాడనేది తాజా సమాచారం. ఆ సినిమా అవుట్ పుట్ పట్ల సంతృప్తి చెందని శేఖర్ కమ్ముల, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల ఇంతటి నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే.