టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్..భారత జట్టు ఇదే..

0

చాలాకాలం తరువాత శిఖర్ ధావన్ టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతనికి కెప్టెన్సీ బాధ్యతను ఇచ్చింది.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

వెస్టిండీస్‌-భారత్ వన్డే సిరీస్‌ ఈ నెల 22న ప్రారంభం కానుంది. దీంతో 16 మంది సభ్యులతో కూడిన జట్టును భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. రవీంద్ర జడేజాకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్​ల సరీస్​కు రోహిత్​ శర్మ, కోహ్లీ, పంత్​, బూమ్రా, హార్దిక్​ పాండ్యాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.

దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి అవకాశం దక్కగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నాురు. ఇదివరకు శ్రీలంకతో జరిగిన సిరీస్​కు కూడా శిఖర్‌ ధావన్‌ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. జూలై 22- మొదటి వన్డే, జూలై 24- రెండో వన్డే, జూలై 27- మూడో వన్డే జరగనుంది. వన్డేలకు తర్వాత..వెస్టిండీస్‌తో భారత్​ జట్టు టీ20 సిరీస్​ ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here