బిగ్ బాస్ హౌస్ నుంచి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్

బిగ్ బాస్ హౌస్ నుంచి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్

0

బిగ్ బాస్ ,3 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఆదివారం ఎలిమినేట్ అయింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి వారంలోనే ఆమె ఎలిమినేషన్ లోకి అడుగు పెట్టింది. కానీ శిల్పా కాకుండా గత వారం అలి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ వారం మాత్రం శిల్ప తప్పించుకోలేక పోయింది.

వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది శిల్ప. వచ్చీరాగానే శ్రీముఖి ని టార్గెట్ చేసింది. దీంతో శిల్ప రాకతో ఈ షో ఆసక్తిగా సాగుతోందనీ అందరూ అనుకొన్నారు. కానీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే ఈ వారం శిల్ప తో పాటు శ్రీముఖి, హిమాజ, పునర్నవి, మహేష్ విట్టలు నామినేట్ అయ్యారు. అయితే వీరిలో తక్కువ ఓట్లు దక్కించుకుని శిల్ప ఎలిమినేట్ అయ్యింది.