మాజీ ఎంపీ తీవ్ర అస్వస్థత

మాజీ ఎంపీ తీవ్ర అస్వస్థత

0

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, తెలుగుచలన చిత్ర హస్య నటుడు శివప్రసాద్ రావు ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హూటా హుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని కొన్నిరోజులు బెడ్ రెస్ట్ అవసరం అని అన్నారు.

ప్రస్తుతం శివప్రసాద్ రావు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆసుపత్రి యాజమాణ్యానికి ఫోన్ చేసి శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఇక ఆయన అభిమానులు కూడా తమ నేత ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత అనారోగ్యపరంగా మీడియాముందు కనిపించలేదు. ఇటీవలే చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేసినా అనారోగ్యంతో శివప్రసాద్ రావు హాజరు కాలేకపోయారు.