టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ కి షాక్

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ కి షాక్

0

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజహరుద్దీతోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది… అయితే ఆయన పై ఎప్పుడూ ఇలాంటి వార్తలు వివాదాలు రావు.. తాజాగా ఈ వివాదం రావడం పై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, పెద్దమొత్తంలో విమాన టికెట్లు తనతో బుక్ చేయించి వాటి డబ్బు చెల్లించలేదంటూ ఔరంగాబాద్ కు చెందిన షాహెబ్ మొహమ్మద్ అనే ట్రావెల్ ఏజెంటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వార్తలుగా వైరల్ అయింది.. వెంటనే దీనిపై అజహరుద్దీన్ మాట్లాడారు.. తానెవరినీ ఎటువంటి మోసం చేయలేదని ట్విట్టర్ వేదికగా అజహర్ స్పష్టం చేశాడు.. 2019 నవంబరు 9 నుంచి 12 మధ్య సుధీష్ అవిక్కల్ అనే వ్యక్తి షాహెబ్ ద్వారా దుబాయ్-పారిస్, పారిస్-ట్యూరిన్, ట్యూరిన్-పారిస్, ట్యూరిన్-ఆమ్ స్టర్ డాం, ట్యూరిన్-మునిచ్-ఆమ్ స్టర్ డాంలకు విమాన టికెట్లు బుక్ చేయించాడు.

ఈ టికెట్లపై సుధీష్ తోపాటు అజహరుద్దీన్ ప్రయాణించారు. టికెట్లు బుక్ చేయమన్నప్పుడు అత్యవసరంగా ప్రయాణం ఉందని, ప్రస్తుతానికి డబ్బు తనవద్ద లేదని, టికెట్లు డబ్బు తర్వాత ఇస్తానని సుధీష్ ఆ సమయంలో చెప్పాడు. అయితే అజహర్ కు సంబంధించిన వారు మేము హమీ అని చెప్పారు కాని చాలా రోజులు అవుతున్నా నగదు చెల్లించడం లేదు, సుమారు 20 లక్షల రూపాయల టిక్కెట్లు బుక్ చేశాడు ఈ నగదు చెల్లించలేదు అని ఫిర్యాదు చేశారు ఆ ట్రావెల్ ఏజెంట్ . అజహర్ మాత్రం దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటాం అని తెలియచేశారు.